Last Updated:

Boy Death : నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. ఎక్కడంటే ?

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Boy Death : నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. ఎక్కడంటే ?

Boy Death : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో అందరి కంటే చిన్నవాడు జగదీశ్. ఈ బాలుడి వయసు రెండున్నర ఏళ్లు. కాగా సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బాలుడు మంచంపై పడుకుని ఆడుకుంటుండగా తల్లి ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటుంది.

అయితే ఈ క్రమంలోనే బాలుడు అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన ఆమె.. వెంటనే పిల్లాడి దగ్గరికి వచ్చింది. అయితే అప్పటికే ఆ చిన్నారి నోట్లో బల్లి కనిపించింది. దీంతో భయపడిపోయిన మహిళ పెద్దగా కకఎలఉ వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఇక చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు.

అయితే బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే స్పష్టం చేశారు. బల్లి శ్వాసకోశ నాళానికి అడ్డం పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. అయితే పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతికి గల కారణాలు తెలియనున్నాయి.