Home / latest national news
సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఈ సారి అతను బీజేపీని టార్గెట్ చేసారు. బీజేపీని విషపూరిత పాము గా అభివర్ణించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్ నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. సదస్సు వేదిక అయిన భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు దేశాధినేతలు మరియు భారత ప్రభుత్వం ఆహ్వానించిన వారితో సహా దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు G20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన -- ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలి అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, G20 డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది.
G20 సదస్సు సందర్బంగా గ్రూప్ సభ్యుల నందరినీ ఉమ్మడి ఏకాభిప్రాయానికి ఒప్పించిన భారతదేశం శక్తిని చూసి ప్రపంచం దాదాపు ఆశ్చర్యపోయింది.షెర్పా అమితాబ్ కాంత్ బృందంలో భాగమైన నలుగురు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ దౌత్యవేత్తలు నెలల తరబడి కష్టపడి చేసిన పని ఫలితంగా ఈ ప్రకటన వచ్చింది.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. G20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సునక్, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనను తాను హిందువుగా గర్వపడతానని చెప్పారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో ఒక ఆలయాన్ని సందర్శించాలనే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి చెరో మూడు అసెంబ్లీ స్దానాలను గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్దానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ది ముందంజలో ఉన్నారు.
ఇండియా పేరును భారత్ గా మార్చుతారన్న వార్తల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి అని సవాలు చేశారు. , దేశం పేరు మార్చడానికి రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని అన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు జనతాదళ్ (సెక్యులర్) మరియు బీజేపీల మధ్య పొత్తు విషయాన్ని జేడీ (ఎస్) వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీల అగ్రనేతల మధ్య కీలక భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పెద్దలు పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.