Home / latest national news
సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారతదేశానికి భారత్‌గా పేరు మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం తీసుకురావచ్చు. భారత రాజ్యాంగం ప్రస్తుతం దేశాన్ని భారతదేశం, అది భారత్..." అని సూచిస్తోంది, అయితే దీనిని కేవలం "భారత్"గా సవరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా 14 మంది మాజీ న్యాయమూర్తులతో సహా మొత్తం 262 మంది ప్రముఖులు మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగాన్ని గమనించాలని వారుకోరారు.
ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైందా.? దానికి రంగం సిద్దం చేసిందా.? ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసిన ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎత్తులు వేస్తోందా అంటే అవున్న సమాధానమే వస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకూ ఒక్క రోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు. ప్రఫుల్ పి.శారద అనే దరఖాస్తుదారు సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాధానం ఇచ్చింది.
ఢిల్లీలో సెప్టెంబరు 8-10 తేదీల్లో జరిగే G20 నేతల సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఢిల్లీలో అందుబాటులో ఉండవు.
ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగం మరో మైలురాయిని చేరింది. ఇస్రో స్టేషన్నుంచి అందిన ఆదేశాలతో విక్రమ్ ల్యాండర్ చందమామపై మరోసారి ల్యాండైంది. మిషన్ లక్ష్యాలని అధిగమించి ల్యాండర్ పని చేస్తోందని ఇస్రో ట్వీట్ చేసింది.
విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం చెప్పారు. మరాఠా కోటా డిమాండ్‌పై మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో షిండే ప్రకటన వెలువడింది.
దేశరాజధాని ఢిల్లీలో జరిగే G20 సమ్మిట్‌కు తరలివచ్చే వివిధ దేశాల అధినేతల జీవిత భాగస్వాములకు మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ హౌస్‌లో ప్రత్యేక లంచ్‌తో విందు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.మెనూలో మిల్లెట్ ఆధారిత రుచికరమైన వంటకాలు ఉంటాయని వారు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మాన్ని డెంగ్యూ మరియు మలేరియాతో పోల్చి, దానిని వ్యతిరేకించడమే కాదు నిర్మూలన చేయాలని చెప్పడంపై దుమారం రేగింది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది.