Home / latest national news
కేరళలోని కోజికోడ్ లో నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందిన నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. సమీపంలోని ఏడు పంచాయతీలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు. నియంత్రణలు చేపట్టింది.
రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
కేరళలోని కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు "అసహజ మరణాలు" నమోదవడంతో ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మరణాలకు నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణమని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఇద్దరు మృతి చెందారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నాలుక, కళ్లు పీకేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు. బీజేపీ పరివర్తన్ సంకల్ప్ యాత్ర సందర్భంగా రాజ్‌స్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడుతూ మన పూర్వీకులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్బంగా పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫారాలు ధరించనున్నారు. యూనిఫామ్‌లో 'నెహ్రూ జాకెట్లు' మరియు ఖాకీ-రంగు ప్యాంట్లు ఉంటాయి.
ముంబై-గౌహతి ఇండిగో విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గౌహతిలో పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా జప్తు చేశాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది.
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.