Home / latest cinema news
12 ఏళ్ల తర్వాత హీరో ప్రభాస్ మొగల్తూరికి వచ్చారు. చాలా సంత్సరాల తర్వాత ప్రభాస్ సొంతూరికి రావడంతో ఆ ప్రాంతమంతా డార్లింగ్ ఫ్యాన్స్ తో సందడిగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కృష్ణం రాజు సంస్మరణ సభ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొన్నారు.
ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది కానీ గాడ్ ఫాదర్ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం బుధవారం అనగా 28సెప్టెంబర్ 2022న ఘనంగా అనంతపురంలో జరిగింది. మరి ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీపై రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో "అన్నయ్యా థాంక్యూ అంటూ" చిరంజీవికి సత్యదేవ్ ట్వీట్ చేశారు. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారంటూ సత్యదేవ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
డీజే టిల్లు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఆదిపురుష్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంఛ్ చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
‘ఉప్పెన’తో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
బెల్లంకొండ గణేశ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం 'స్వాతి ముత్యం'. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వివి వినాయక్ దర్శకత్వంలో తారక్ కెరీర్ల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘ఆది. ఈ సినిమా తారక్ కు మంచి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని నవంబర్ నెలలో రీరిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట.
ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ జోడించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ మూవీని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ ప్రేక్షకుల ముందు విడుదలై అపూర్వ విజయాన్ని సాధించింది.