Last Updated:

God Father: నాకు గాడ్ ఫాదర్స్ వాళ్లే- చిరంజీవి

ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది కానీ గాడ్‌ ఫాదర్‌ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం బుధవారం అనగా 28సెప్టెంబర్ 2022న ఘనంగా అనంతపురంలో జరిగింది. మరి ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.

God Father: నాకు గాడ్ ఫాదర్స్ వాళ్లే- చిరంజీవి

God Father: ఆచార్య సినిమాతో మిమ్మల్ని మెప్పించలేకపోయాననే బాధ నాలో ఉంది కానీ గాడ్‌ ఫాదర్‌ తో ఆకట్టుకుంటా. ఈ చిత్రవిజయానికి నాదీ పూచీ’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమం బుధవారం అనగా 28సెప్టెంబర్ 2022న ఘనంగా అనంతపురంలో జరిగింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.

ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలోని ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. అయితే ప్రోగ్రాం మధ్యలో వర్షం పడింది అయినాకానీ తడుస్తూనే అభిమానుల్ని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడారు. నా వెనకాల ఏ గాడ్‌ఫాదర్‌ లేరని అంటుంటారు కానీ ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఈ స్థితిని ఇచ్చిన నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్ అని మెగాస్టార్ అన్నారు.

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో చిరంజీవి ఉద్వేగపూరిత ప్రసంగాన్ని ఇచ్చారు. నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతుంది. ఇవాళ మా ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో వర్షం పడటం ఆ భగవంతుడి ఆశీర్వాదమేనని మెగాస్టార్ అన్నారు. తాను ఈ సినిమా చెయ్యడానికి కారణం రామ్‌ చరణ్‌ అని లూసిఫర్ చిత్రం చూసి చరణ్‌ మీరు ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పారని ఆయన తెలిపారు. ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా అందరినీ ఆకట్టుకుంటుందని వెల్లడించారు. జయాపజయాలు అందరికీ సహజమేనని. గత చిత్రంతో ప్రేక్షకులను మెప్పించలేకపోయానని ఈ గాడ్ ఫాదర్ మీ అందరినీ మెప్పిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

అటుపోతే ప్రీరిలీజ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకడు గార్లదిన్నె నుంచి తన అభిమాన హీరోను చూడడానికి అనంతపురానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుని మృతి చెందాడు. మరియు ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవిని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాట కారణంగా ఓ యువతి గాయపడింది.

ఇదీ చదవండి: రామ్ చరణ్ నటన ప్రస్థానానికి నేటికీ 15 ఏళ్ళు!