Last Updated:

Anushka: అనుష్క పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. బ్యూటీ క్వీన్ గా స్వీటీకి అభిమానుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే నాలుగు పదుల వయస్సు దాటుతున్నా ఆమె ఇంతవరకూ పెళ్లాడలేదు. మరి ఆమె పెళ్లాడకపోవడానికి అనేక కారణాలుండొచ్చు కానీ స్వీటీ అభిమానులు మాత్రం అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా స్వీటీ పెళ్లిచేసుకోబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Anushka: అనుష్క పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా..?

Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. ఆమె పేరు వింటే అటు యువతుల్లోనూ ఇటు యువకుల్లోనే క్రేజ్ ఎక్కువే. బ్యూటీ క్వీన్ గా స్వీటీకి అభిమానుల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే నాలుగు పదుల వయస్సు దాటుతున్నా ఆమె ఇంతవరకూ పెళ్లాడలేదు. మరి ఆమె పెళ్లాడకపోవడానికి అనేక కారణాలుండొచ్చు కానీ స్వీటీ అభిమానులు మాత్రం అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా స్వీటీ పెళ్లిచేసుకోబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరని ఈ బ్యూటీ పెళ్లాడబోతుందో చూసేద్దాం.

అందం, అభినయం స్వీటీ సొంతం. తన నటనతో విశేష గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. 2005లో సూపర్‌ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అలా తెలుగు, తమిళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు అరుంధతి చిత్రం ఒక్కసారి స్టార్డమ్ తీసుకొచ్చింది.
ఆ మూవీలో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంది ఈ మంగుళూరు భామ. ఆ తర్వాత ప్రభాస్ జంటగా నటించిన బాహుబలి చిత్రంతో ఆమె నటనా ప్రావీణ్యం దేశాంతరాలు దాటిందని చెప్పవచ్చు. భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరించింది ఈ స్వీటి. ఇదిలా ఉండగా ఒక్కసారిగా సైజు జీరోతో నట జీవితం తలకిందులు మారిందని చెప్పవచ్చు. ఈ మధ్యలో ప్రభాస్‌తో ప్రేమాయణం అంటూ ఆమెపై వార్తలు గట్టిగానే ప్రచారమయ్యాయి. అయితే వాటిని అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరూ కొట్టిపారేశారు. తాము మంచి ఫ్రెండ్స్‌ అని క్లారిటీ ఇచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో 42 ఏళ్ల అనుష్క మనసు పెళ్లివైపు మళ్లిందని తాజాగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణకు చెందిన ఓ గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడేందుకు స్వీటీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిలో నిజానిజాలెంతా అన్నది మాత్రం ప్రశార్థకం.

ఇదీ చదవండి: సొంతూరిలో ప్రభాస్.. రెబల్ స్టార్ అభిమానులతో సందడిగా మారిన మొగల్తూరు

ఇవి కూడా చదవండి: