Home / Kerala
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఏడు పంచాయతీలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా గురువారం 12 గంటల హర్తాళ్ పాటించాయి. బియ్యం కోసం రేషన్ దుకాణాలు మరియు ఇళ్లపై దాడి చేస్తున్న అడవి ఏనుగు ‘అరికొంబన్’ని పట్టుకోవడాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా ఈ హర్తాళ్ జరిగింది.
కేరళకు చెందిన ట్రాన్స్‌వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
చనిపోయిన తరువాత అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసే అత్యధిక వ్యక్తులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో సుమారు 1.30 లక్షల మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయగా, ఢిల్లీలో దాదాపు 58,000 మంది అవయవదానానికి నమోదు చేసుకున్నారు.
వివాహం చేసుకున్న దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, కేరళలోని కాసరగోడ్‌లో ఒక ముస్లిం జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోనున్నారు. న్యాయవాది మరియు నటుడు షుకూర్ ,అతని భార్య షీనా తమ వివాహాన్ని కొత్తగా నమోదు చేసుకోనున్నారు.
కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటీష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో దాదాపు రూ.40 లక్షల భారీ ధర పలికింది.
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Kochi police: మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు ప్రయాణించే వారిని సైతం రిస్క్ లో పెడుతున్నారు. నిత్యం మద్యం మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ఇక మద్యం సేవించి.. వాహనం నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష విధించారు.
కేరళకు చెందిన ట్రాన్స్ జెండర్ జంట జియా పాయల్, జహాద్ తల్లిదండ్రులు అయ్యారు. కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సిజేరియన్ ద్వారా పండంటి బిడ్డ పుట్టింది. ఈ విషయాన్ని జియా పావల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్కు కారణమైన అంటువ్యాధి నోరోవైరస్ సంక్రమణకు సంబంధించిన రెండు కేసులు కేరళలో వెలుగుచూసాయి.