Home / Kerala
కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
కేరళలోని కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన పలు పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో పలు పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు.
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.
కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ యొక్క కొత్త కేసును ధృవీకరించారు. దీనితో మొత్తం బాధిత వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకిందని మంత్రి తెలిపారు.
కేరళలోని కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు "అసహజ మరణాలు" నమోదవడంతో ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మరణాలకు నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణమని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఇద్దరు మృతి చెందారు.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
Biporjoy Cyclone: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. దీనికి కారణం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్ జాయ్’ తుపాను. ఈ తుపాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. దీనివల్ల రుతుపవనాల రాకకు మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ‘నైరుతి రుతుపవనాల రావడం ఇప్పటికే 6 రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు […]