Home / Kanaka Durgamma
దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.