Home / Jana Sena chief Pawan Kalyan
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సచివాలయంలోని తన ఛాంబర్లో చంద్రబాబు నాయుడు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
తాను చేయలేని పాదయాత్ర నారా లోకేష్ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర వలన ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసే అవకాశం లభిస్తుందన్నారు. లోకేష్ యాత్ర జగన్ యాత్ర లాగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని ప్రజలతో మమేకమైన యాత్రని అన్నారు.
విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సమీక్షించి చర్చించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు అశేష జనవాహిని మధ్య పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి పెడనకు తాజాగా చేరుకున్నారు. ఆద్యంతం పవన్ కు జనసేన నేతలు
జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్‌కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు.