Home / Jammu Kashmir
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు.
జమ్ము కశ్మీర్‌లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో సబ్-ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. కశ్మీర్ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సురేందర్ సింగ్ తో సహా నలుగురిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన రెండు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ రెండింటిలో ఒకటి శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని ఎస్ఎస్ఐ బ్రాంచ్ కాగా, మరొకటి జమ్మూలోని చన్నీరామ బ్రాంచ్.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగివున్నందుకు జమ్ము కశ్మీర్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, ఉద్యోగులు నార్కో-టెర్రర్ సిండికేట్‌ను నడుపుతున్నారు మరియు ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి నిషేధిత సంస్థలకు సహాయం చేస్తున్నారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ జిల్లాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నివసిస్తున్నవారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
సూపర్ మార్కెట్లకు, వైన్ షాపులకు తేడా లేకుండా చేశారు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూ-కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే దీనిని భాజపా శ్రేణులు ఖండిస్తున్నారు