Home / Jammu Kashmir
నిత్యం తుపాకుల శబ్దాలతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కాగా మంగళవారం నాడు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులతో జమ్మూ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాల పంపిణీకి ఉపయోగించే డ్రోన్‌ను అడ్డగించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.
పాక్షికంగా నిలిపివేసిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించడంతో నిలిచిపోయిన యాత్ర. మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేమని, మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉందని, యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నామని అమరనాథ్