Home / Jammu Kashmir
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్ పర్యటనలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. గుజ్జర్లు, బకర్వాల్ లతోపాటు పహారీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సిన్హాతో పాటు అయన వైష్టోదేవిని దర్శించుకున్నారు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
జమ్ముకశ్మీర్‌లోని వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ అనుమానాస్పద బ్లాస్ట్ లు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఉధంపూర్‌లో గంటల వ్యవధిలోనే రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. వీటిపై అధికారులు ఆరా తీరుస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.
జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా దళాల సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు దొరికారు.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మంగళవారం శ్రీనగర్‌లో కాశ్మీర్ మొదటి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. ప్రముఖ థియేటర్ చైన్ ఐనాక్స్ సహకారంతో, బాదామి బాగ్ కంటోన్మెంట్ సమీపంలోని శివపోరా వద్ద మల్టీప్లెక్స్ మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా థియేటర్లను కలిగి ఉంది.
జమ్ముకశ్మీర్‌కు చెందిన సబ్రినా ఖలిక్ ముగ్గురు పిల్లలకు తల్లైనా టెన్త్ టాపర్ గా నిలిచి వార్తల్లో కెక్కింది. సబ్రినా పెళ్లికి ముందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. కానీ పై చదువులు చదువాలన్న కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.