Home / International News
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది దుర్మరణం పాలవ్వగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. ముల్తాన్ - సుక్కూర్ మోటార్‌వేలో ఆయిల్ టాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
చైనాకు చెందిన గూఢచార నౌక శ్రీలంకకు చేరింది. శ్రీలంకలోని హంబన్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న ఈ నౌకపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ గూఢచార నౌకకు శాటిలైట్లను, ఖండాంతర క్షిపణులను ట్రాక్ చేసే సత్తా ఉండటంతో భారత్ వ్యతిరేకతను తెలిపింది.
పోలియో కారకవైరస్ గుర్తించినట్లు న్యూయార్క్ వైద్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలోని వేస్ట్ వాటర్ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తోందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఈ వైరస్ విస్తరించకముందే న్యూయార్క్
ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లతో పాటు
అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో రచయిత సల్మాన్ రష్దీ మెడ, పొత్తికడుపుపై ఒక వ్యక్తి కత్తితో దాడిచేసారు. 75 ఏళ్ల రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు .అతను ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతనిపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
తాలిబన్ మత గురువు రహీముల్లా హక్కానీ ఐసీస్ ఆత్మాహుతి దాడిలో మృతి చెందారు. ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మదర్సాలో ఆయనను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఇటీవల కాలంలో ఆయన బాలికలు స్కూళ్లకు వెళ్లి విద్యనభ్యసించవచ్చునని పలుమార్ల బహిరంగ మద్దతు ప్రకటించారు.
ఈ ఏడాది బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు విపరీతమైన ఎండలు కాస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంగ్లండ్‌లో పాటు వెల్స్‌లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా మహమ్మారితో రెండేళ్ల పాటు యావత్ ప్రపంచం అల్లాడినా, ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల అక్కడ కూడా వైరస్ విజృంభించిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే లక్షల మంది ప్రజలు జ్వరం బారినపడ్డారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తాత్కాలికంగా నివసించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్న రాజపక్స వీసా నేటితో ముగిసిపోతుంది. కాబట్టి సింగపూర్ నుంచి వేరే ఇతర దేశానికి మకాం మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది.