Home / International News
ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్
పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా, అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు రష్యా
లండన్‌లో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. బ్రిటిష్ రాజధాని లండన్‌లో శుక్రవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. అండర్‌గ్రౌండ్ రైల్వే సర్వీసుతో పాటు ఓవర్ గ్రౌండ్ రైల్వే సర్వీసులు దాదాపు నిలిచిపోయాయి.
మందు తాగండోయ్ బాబు. మందు తాగండోయ్ అంటూ యువతను బతిమాలుకుంటోంది జపాన్ ప్రభుత్వం. సడెన్‌గా జపాన్ యువత బుద్ది మంతులయ్యారు. మందుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండిపడింది.
కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు.
ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్న సందర్భంలో కేరింతలు, జోరుగా నృత్యాలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రతిపక్షాలు, ఆమె డ్రగ్స్ తీసుకొని ఉండొచ్చని ఆరోపిస్తున్నాయి.
చైనాలో ఓ ఉద్యోగికి కౌగిలింత ఖరీదైన వ్యవహారంగా మారింది. తన సహోద్యోగిని కౌగలించుకోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. తన కోలిగ్ గట్టిగా కౌగిలించుకోవడం వల్ల తన పక్కటెములు పటపటమంటూ విరిగాయని ఆమె కోర్టుకు విన్నవించింది.
సల్మాన్ రష్దీని హత్య చేయడానికి ప్రయత్నించిన 24 ఏళ్ల హదీ మాతార్ రష్దీ ఇంకా బతికే ఉన్నడనే సరికి ఆశ్చర్యపోయాడు. న్యూయార్కులో ఓ సాహితీ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఉద్యుక్తుడవుతుండగా మాతార్ పరుగు పరుగున వచ్చి సల్మాన్ రష్దీ మెడపై, పొట్టలో కత్తితో దారుణంగా పొడిచాడు.
ప్రపంచం మొత్తం అధిక జనాభాతో సతమతమవుతోంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమ దేశం తల్లులను ఎక్కువ మంది పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తున్నారు. రష్యాలో క్రమంగా శిశు జననాల రేటు తగ్గిపోవడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ వెనుకంజలో ఉన్నారు. బోరిస్ జాన్సన్ తర్వాత ప్రధాన మంత్రిగా లిజ్ ట్రుస్ ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఆ పార్టీ సభ్యుల్లో అత్యధికులు లిజ్ వైపు నిలిచారు. దీంతో రుషి ఆమె కన్నా 32 పాయింట్లు వెనుకబడి ఉన్నారు.