Home / IND vs AUS T20
టీమిండియాపై ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 లో సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీ20 మూడవ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా మొదటిగా బ్యాటింగ్ చేసి 120 బంతులకు 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 7-8 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా దూకుడు మామూలుగా లేదు ఆ సమయంలో 220 పరుగులు ఈజీగా చేసేస్తారనిపించింది.ఆ సమయంలో టీమిండియా వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా రన్ రేట్ తగ్గుతూ వచ్చింది.
టీ20ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తరువాత టీమ్‌ఇండియా 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి విజయం సాధించి స్కోర్ సమం చేసుకోగా.. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరుకు నేడు ఉప్పల్ స్టేడియం వేదికకానుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. నాగపూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ని 1-1గాసమం చేసింది. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి టీం ఇండియా పగతీర్చుకుంది.
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొనింది.
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.