Home / ICICI Bank
సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు నిత్యం బ్యాంకింగ్ రంగంపై ఆధారపడుతూనే ఉంటారు. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా బ్యాంకింగ్ సేవలను నిత్యం వినియోగిస్తూ ఉండడం సాధారణంగా మారిపోయింది. కాగా కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ వినియోగం, బ్యాంకింగ్ సేవలను మరింత ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఊహించని విధంగా బ్యాంకులు అందరికీ షాక్ ఇవ్వనున్నాయి.
దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వేసవికి బొనాంజా ఆఫర్లు తీసుకొచ్చినట్టు ప్రకటించింది.
ఐసిఐసిఐ బ్యాంక్ మంగళవారం యుపిఐ చెల్లింపుల కోసం ఇఎంఐ సౌకర్యాలను ప్రవేశపెట్టింది. ఏదైనా స్టోర్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా దీనిని పొందవచ్చు. తన వెబ్సైట్లోని నోటిఫికేషన్లో, బ్యాంక్ తన ‘ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించండి’ సేవకు అర్హత పొందిన కస్టమర్లు ఇప్పుడు ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొంది.