Home / Hyderabad
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.
గణేశ్ నవరాత్రులనగానే బాలాపూర్ లడ్డు వేలంపాట కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏటికేడు బాలాపూర్ లడ్డూ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రికార్డును బ్రేక్ చేస్తూ అల్వాల్ లో రూ.46 లక్షలకు వేలంపాట పాడగా, ఈ రికార్డును కూడా బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
తెలంగాణ పై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. హైదరాబాద్ సహా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది
హైదరబాదు మెట్రో రైలు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా 4లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించిన్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
దేశమంతా ప్రధాని మోధీ ప్రభంజనమే. మరో 30ఏళ్లు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. తెలంగాణాలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే. డబ్బులుంటే జాతీయ పార్టీ పెట్టడం సులభమే
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తారు.