Home / Hyderabad
గణేష్ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు చాల మహిమగలదని భక్తుల విశ్వాసం. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. అయితే గణేష్ లడ్డు వేలంపాట అంటే అందరికి బాలాపూర్ లడ్డునే గుర్తువస్తుంది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ లో శుక్రవారం జరగబోయే గణేశ్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్ల పై రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తారు.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్లో2019తో పోల్చితే 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారుల మరణాలు 276% పెరిగాయి. ఇది దేశంలోని 53 నగరాల్లో 2019లో 22 నుండి ఏడవ స్థానానికి చేరుకుంది. అయితే పాదచారుల గాయాల పరంగా (590), హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
లివా మిస్ దివా సూపర్నేషనల్- 2022 కిరీటాన్నితెలుగు అమ్మాయి ప్రజ్ఞ అయ్యగారి కైవసం చేసుకుంది. ప్రేమ కిరీటంతో హైదరాబాద్లో అడుగుపెట్టిన ప్రజ్ఞకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
గత నాలుగు రోజులుగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తు వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. కాగా ఈ వానల దాటికి చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది.
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.