Home / Hyderabad
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావు సస్పెండ్ అయ్యారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద సీఐ నాగేశ్వర్ రావుపై కేసు నమోదయింది. దీనితో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు.