Home / Hyderabad
‘SAI SHIVAM’(సాయి శివం) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో మహారాష్ట్రలోని నాసిక్ మాత్రమే కాకుండా షిర్డీ సాయి సన్నిధిని సందర్శించుకోవచ్చు.
Hyderabad: స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య ఒక్కడి వల్ల జరగలేదని.. దీని వెనక ఎవరో ఉన్నారని ఆరోపించారు.
Hyderabad Murder: ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్‌ను హత్య చేసిన అనంతరం హరిహర కృష్ణ.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నేరాన్నీ అంగికరించినట్లు తెలుస్తోంది.
Hyderabad Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని ఓ యువకుడు స్నేహితుడినే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 17న హత్య జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. అలాంటి తాజా ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తా గల బస్‌స్టాప్‌లో ఒక్కసారిగా యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
Street Dogs: హైదరాబాద్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆడుకోవడానికి బయటకి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయింది. తండ్రి, అక్కతో కలిసి బయటకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వీధికుక్కలు విచక్షణరహితంగా దాడి చేయడంతో.. బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రైమ్ 9కథనాల ఎఫెక్ట్ తో బాలాపూర్ భూ కుంభకోణంపై కదిలిన అధికార యంత్రాంగం. నిందితుడు కడారి అంజయ్య, బాలాపూర్ మండల తహసీల్దార్, కొందరు బీఆర్ఎస్ నేతలు, చంద్రశేఖర్ గౌడ్, స్నేహిత బిల్డర్స్ అధినేత సహా 30మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశాలు.
Taraka Ratna: నందమూరి తారకరత్న మరణవార్తను తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. తారకరత్న మృతి.. అభిమానులని, కుటుంబ సభ్యులను, సినీ పరిశ్రమని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.
Hyderabad Pubs: హైదరాబాద్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. పబ్ లు, ఫామ్ హౌజ్ లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఇందులో పట్టుబడ్డవారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత కొంతకాలంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలు శుక్రవారం దిగి వచ్చాయి. మరో వైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 58 వేలకు వెళ్లిన బంగారం ధర ఇపుడు 56 వేల దిగువకు వచ్చింది.