Last Updated:

Income Tax Raids: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాదులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నగరంలోని కూకట్ పల్లితో పాటు.. శివారు ప్రాంతాల్లోని వారి ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు వంద టీములతో ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Income Tax Raids: హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Income Tax Raids:  హైదరాబాదులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నగరంలోని కూకట్ పల్లితో పాటు.. శివారు ప్రాంతాల్లోని వారి ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు వంద టీములతో ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.  KPHBలోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్‌తో పాటు.. మాగంటి గోపీనాథ్, అతని బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్ గా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అమీర్ పేట్, శంషాబాద్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు..(Income Tax Raids)

అమీర్‌పేట్‌లో పూజకృష్ణ చిట్‌ఫండ్స్ సంస్థపై 20 టీమ్స్ తనిఖీలు జరుగుతున్నాయి. డైరెక్టర్స్ సోంపల్లి నాగరాజేశ్వరి, .పూజలక్ష్మీ, ఎండీ కృష్ణప్రసాద్ ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్‌లో చిట్‌ఫండ్స్ సంస్థ యజమాని రఘువీర్ ,కూకట్‌పల్లిలో ఇందు ఫార్చ్యూన్ విల్లాలో కోటేశ్వరరావు నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపుపన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతోఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మొత్తంమీద ఏకకాలంలో 100 టీమ్స్ ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.