Home / Hyderabad
Fire Accident Hyderabad: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పురానాపూల్ లోని ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది.
Hyderabad Metro Rail: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ మెట్రోపై కీలక ప్రకటన చేశారు. మెట్రో ధరలు పెంచితే ఊరుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
E Racing: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ -రేసింగ్ లో గందరగోళం నెలకొంది. దీంతో ఈ రేస్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ వాహనాలు ఒక్కసారిగా.. ట్రాక్ పైకి రావడంతో 45 నిమిషాల పాటు రేసింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను తొలగించడంతో తిరిగి రేసింగ్ ప్రారంభమైంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసింగ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నెల 11 న జరగనున్న ఫార్ములా రేసింగ్ పోటీలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది.
‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్..ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.