Home / Himachal Pradesh
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దేశం పట్ల వారి త్యాగం మరియు అంకితభావానికి వారిని కొనియాడారు. వీరులకు భారతదేశం కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని అన్నారు. హిమాచల్లో బలగాలతో గడిపిన సమయం లోతైన భావోద్వేగం మరియు గర్వంతో నిండి ఉందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో గురువారం కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు బహుళ-అంతస్తుల భవనాలు కూలిపోతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న వరదల నేపధ్యంలో హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మరణించిన వారి సంఖ్య హిమాచల్ ప్రదేశ్లో 90కి చేరుకుంది. గత నాలుగు రోజుల్లో 39 మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు
ఉత్తర భారతంలోదేశరాజధాని ఢిల్లీతో సహా పంజాబ్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి.ఢిల్లీ ఎన్సిఆర్కి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు, దేశ రాజధాని ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు ఐఎండి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పంజాబ్ మరియు హర్యానా లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసారు.
: గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ డేటాబేస్ను రూపొందించిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరించిందని సోమవారం ఒక అధికారి తెలిపారు.గత ఏడాది ఏప్రిల్లో ఈ ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటివరకు 150 గుర్తుతెలియని మృతదేహాల డీఎన్ఏ నమూనాలను డేటాబేస్లో భద్రపరిచామని తెలిపారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక్కో సీసాపై రూ.10 ఆవు సెస్ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హిమాచల్ అందాలను […]
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.