Home / high court
ఏపీలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ జరపాలని వైసీపీ నేతలు హై కోర్ట్ లో పిటిషన్ లు వేశారు . పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్లకు పాల్పడ్డారని రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు .
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు స్థలాన్ని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయని తెలిపారు.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022లో జరిగిన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన దండె విఠల్ గెలుపొందారు.
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన జస్టిస్ దినేష్ కుమార్ శర్మ తనపై వచ్చిన ఆరోపణలు 'చాలా తీవ్రమైనవి' అని అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాంచీలో సుమారు రూ550 కోట్లతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. సుమారుగా 165 ఎకరాలల్లో ఉన్న కొత్త హైకోర్టు విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్దది.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు.
Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
High Court: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
గతంలో ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారు మాత్రమే ఆర్ఎస్ఎస్ మార్చ్ లో పాల్గొనాలని హైకోర్టు ఆదేశం. మసీదు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక బందో బస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గానే వాళ్లు ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయోద్దని తెలిపింది.
Tslprb: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రాథమిక పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.