Last Updated:

KTR Petition: హైకోర్టులో కేటీఆర్‌కు షాక్.. కేసు కొట్టివేతతో దూకుడు పెంచిన ఏసీబీ

KTR Petition: హైకోర్టులో కేటీఆర్‌కు షాక్.. కేసు కొట్టివేతతో దూకుడు పెంచిన ఏసీబీ

High Court big shock to ktr dismissed quash petition in formula e car race case: హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయవద్దని కేటీఆర్ అడ్వకేట్ కోర్టును కోరారు. అయితే ఇలాంటి పిటిషన్‌లలో కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏసీబీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అరెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది.

హైకోర్టు తీర్పుతో తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కవిత, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు చేరుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు న్యాయనిపుణులతో భేటీ కానున్నారని సమాచారం.

కాగా, హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. అలాగే ఫార్ములా ఈ కేసులో పలుచోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలలో రికార్డును పరిశీలిస్తుంది. దీంతో పాటు జెన్ నెక్ట్స్ కంపెనీలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.