Home / Hardeep Singh Nijjar
కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి ముగ్గురు యువకులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో నిజ్జర్ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత ఇండియా, కెనడాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయి.
:కెనడా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణను పునరుద్ఘాటించారు తమ దేశం ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన కోసం నిలబడుతుందని అన్నారు.
వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం పాత్ర పోషిస్తుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత సోమవారం భారతదేశం మరియు కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి.
కెనడా కేంద్రంగా రోజురోజుకీ విస్తరిస్తున్న ఖలిస్థాన్ భావన దౌత్యపరమైన ఉద్రిక్తతలని రెచ్చగొడుతోంది. కెనడా.. భారత దేశాలు దౌత్యవేత్తలని బహిష్కరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది.
భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టు గా ప్రకటించిన కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. అతను గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు.