Home / H-1B visa
యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్లో కొన్ని వర్గాల H-1B వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది. దీనిద్వారా స్వదేశాలకు వెళ్లకుండా ఎన్నారైలు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది గణనీయమైన సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత ప్రధాని మోదీ చారిత్రాత్మకమైన యునైటెడ్ స్టేట్స్ పర్యటన నేపధ్యంలో హెచ్-1బీ వీసాలు ఉన్న భారతీయులకు దేశంలో నివసించడం మరియు పని చేయడం సులభతరం చేయాలని బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు రాయిటర్స్ తెలిపింది.
హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.