Home / gymkhana ground
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం హైదరాబాద్ ఉప్పల్‌లో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. టిక్కెట్ల విక్రయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్టర్‌ప్లాప్ అయ్యింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కి వేదికగా నిలవడం వల్ల టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్లను గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేర్కొనడంతో.. సికింద్రాబాద్‌లోని జిమ్ఖానా మైదానానికి బుధవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు.