Home / gujarath elections
గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ తెలిపింది.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్‌లో 182, హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా... పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి.