Home / Gudivada
గుడివాడలో ఇన్నాళ్లూ అక్రమంగా శరత్ థియేటర్‌ను అక్రమించుకుని ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం.
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
వైసీపీ నాయకుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.
గుడివాడ మీదుగా సాగుతున్న అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఆధ్యంతం పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైకోర్టు నిబంధనల మేరకు చేపడుతున్న పాదయాత్రలో రైతులతో పాటు పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వచ్చిన వారిని సైతం గుడివాడ పోలీసులు అడ్డుకొన్నారు.
తాను వచ్చే ఎన్నికల్లో ఏపీలోని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి ఎోటీ చేస్తానని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఖమ్మంలో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు.
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పాలంకి బ్రదర్స్ షాకిచ్చారు. వైసిపి వీడి వారిద్దరూ జనసేనలో చేరారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జనసేన జెండా కప్పి పాలంకి బ్రదర్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించారు.