Home / Graduate MLC Elections
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా జరుగుతుంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో ఈ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ మేరకు తాజాగా వచ్చిన ఫలితాలు వైకాపాకి ఊహించని షాక్ ఇచ్చాయి. పట్టభద్రులు అధికార పార్టీకి అనుకోని రీతిలో ఓటమిని కట్టబెట్టారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
త్వరలో ఏపిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్‌రెడ్డి