Home / Glass Symbol
ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం .
గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..
ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ ఇంకా పోలేదు .ఇటీవల గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు