Home / Ganga River
భారీ వర్షాల నేపధ్యంలో గంగా నది ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భీమ్‌గోడ బ్యారేజీ యొక్క ఒక గేటు దెబ్బతింది. దీనితో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.హర్ కి పౌరి ఘాట్ సమీపంలోని భీమ్‌గోడ బ్యారేజీ యొక్క స్లూయిస్ గేట్ దెబ్బతినడంతో హరిద్వార్‌లోని గంగలో నీటి మట్టం ఆదివారం హెచ్చరిక స్థాయి 293 మీటర్లకు చేరుకుంది. అధికారులు హై అలర్ట్ జారీ చేసి, దిగువన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
వారణాసి దేశంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. బెనారస్/బనారస్, కాశీ, లేదా వారణాసి గా పిలుచుకునే ఈ నగరానికి సుమారుగా ఐదువేల సంవత్సరాల చరిత్ర వుంది. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా వారణాసికి వెళ్లాలనుకుంటారు. కాశీవిశ్వనాధుడి దర్శనం చేసుకుని గంగానది ఒడ్డున ఆరతిని చూస్తే చాలు జన్మ ధన్యమయినట్లే అని భావించేవారెందరో వున్నారు.