Home / fuel price hike
మేఘాలయ ప్రభుత్వం తాజాగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు విషయాన్ని మేఘాలయ ట్యాక్సేషన్ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం పెట్రోల్ పై పన్నును లీటరుకు రూ.12.50కు లేదా 13.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం.