Home / Free Electricity
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందించే 'గృహ జ్యోతి' పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులు ఈ పథకాన్ని వాణిజ్యపరంగా పొందలేరని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. 'గృహ జ్యోతి'ని ప్రవేశపెట్టడంతో పాటు, జూన్ 11 నుండి మహిళలకు 'శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో ఉన్న రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ గడ్డపై మన ప్రభుత్వమే రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.