Home / Fraud Case
మహారాష్ట్రలోని ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రాన్ని పొందేందుకు పూణెలో నకిలీ చిరునామాను సమర్పించారు. 'వైకల్య ధృవీకరణ పత్రం' అధికారికంగా యశ్వంతరావు చవాన్ మెమోరియల్ హాస్పిటల్, పింప్రి ద్వారా జారీ చేయబడింది.
FTX వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ క్రిప్టోకరెన్సీ మార్పిడితో కస్టమర్లను మోసం చేసినందుకు గురువారం కోర్టు దోషిగా తేల్చింది.మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులోని 12 మంది సభ్యుల జ్యూరీ, ఒక నెలరోజుల విచారణ తర్వాత అతను ఎదుర్కొన్న మొత్తం ఏడు ఆరోపణలపై అతనిని దోషిగా నిర్ధారించింది.అతనికి గరిష్టంగా 110 సంవత్సరాల జైలు శిక్షపడే అవకాశం ఉంది.
ఖాతాదారుడికి విశేష సౌలభ్యాలు అందించాలన్నది బ్యాంకుల ఉద్ధేశం. కాని కొంతమంది సాంకేతికతను తెలివిగా తమకు అనుకూలించుకొని అప్పన్నంగా సొమ్ములు కొట్టేస్తుంటారు. సమయం చూసి దోచేస్తుంటారు.
అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.