Home / Flood hit areas
ఏపీలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అతాకుతలం చేశాయి. హిందూపూర్, అనంతపురం, కదిరి ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు
ఈ నెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్‌పురం మండలాల్లో 22న పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు మండిపడ్డారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ సీఎం జగన్ ఏరియల్ నేడు వరదప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న 24 నుంచి 48 గంటల్లో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.