Home / Flights Cancelled
గత 24 గంటలుగా కురుస్తున్నభారీ వర్షాలతో ముంబై అతలాకుతలమయింది. పలు ప్రాంతాలు జలమయవమగా సబర్బన్ రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాలలో 48 విమానాలను రద్దు చేసింది. పీఐఏ ప్రతినిధి రోజువారీ విమానాలకు పరిమిత ఇంధన సరఫరా మరియు కార్యాచరణ సమస్యల కారణంగా విమానాలు రద్దు చేయబడ్డాయి
చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సా కు సమ్మె సెగ తగిలింది. వేతనాలు పెంపు, సెలవుల విధానం కోరుతూ సంస్థకు చెందిన పైలట్లు ఈ రోజు నుంచి సమ్మెకు దిగడంతో లుఫ్తాన్సా 800 విమానాలు రద్దు చేసింది.