Home / Fake pesticides
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, గడ్డి మందుల తయారీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 13మంది సభ్యుల ముఠాలో నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరికొందరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. అరెస్టైన వారినుంచి నాలుగు డిసిఎంల లోడ్ నకిలీ పురుగు మందులు, నకిలీ హాలోగ్రామ్ స్టిక్కర్లు, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 57 లక్షల రూపాయలుంటుందని వరంగల్ సిపి రంగనాథ్ మీడియాకి చెప్పారు