Home / Extended
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. వాస్తవానికి అసలు గడువు జూన్ 30తో ముగియాల్సి ఉండగా ఇప్పుడు మరో మూడు నెలలు పొడిగించింది. మోసాలను తగ్గించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం ఈ చర్య లక్ష్యం.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం -యూఏపీఏ కింద సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
మయన్మార్ యొక్క జాతీయ రక్షణ మరియు భద్రతా మండలి సోమవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ఆరు నెలలు పొడిగించడానికి అంగీకరించింది, జుంటా ఆగస్టు నాటికి నిర్వహించాలని భావించిన ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర మీడియా తెలిపింది.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.
ఈ నోటిషికేషన్ ప్రకారం ఓటర్లు ఫామ్ -6బీ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్ అయిన ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్లు సేకరించడం ప్రారంభించింది.
మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.