Home / ED searches
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో నాలుగు చోట్ల రైస్ మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఉద్యోగాల కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించినట్లు ఒక అధికారి తెలిపారు.
హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
కోవిడ్ సెంటర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ముంబై మరియు సమీప ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.పరిశీలనలో ఉన్న సంస్థ లైఫ్‌లైన్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్‌తో సంబంధం కలిగి ఉంది.
బీహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టిందని అధికారులు తెలిపారు. 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.5 కోట్ల నగదు, రూ.11 కోట్ల ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.