Home / delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదరయింది. కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం తిరస్కరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రెండూ దాఖలు చేసిన కేసుల్లో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన రోస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ను విచారిస్తుండగానే.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు కీలక సందేశమిచ్చారు.
డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.