Home / Delhi Air Pollution
దేశ రాజధాని ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రాత్రి ప్రజలు బాణసంచా కాల్చడంతో అది భారీ కాలుష్యానికి దారితీసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన దృశ్యాల్లో దట్టమైన పొగమంచు వీధులను చుట్టుముట్టడం, దృష్టిని తీవ్రంగా పరిమితం చేయడం కనిపించింది.
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.