Home / DAVOS
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12వేల, 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12వేల, 400 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం వెళ్లింది. ఈ నెల 19 వరకూ ఈ సదస్సు జరగనుండగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ ఫోరమ్ సమావేశం సందర్భంగా ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్బర్ట్ బౌర్లా దాని కోవిడ్ వ్యాక్సిన్ యొక్క సమర్థత గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు.