Home / cricket news
ఐపీఎల్ టోర్నీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్‌గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే తమ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో భారత ఆల్ రౌండర్ జడేజా సీఎస్కే నుంచి తొలగించినట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను టీంలోనే కొనసాగించేందుకు ధోనీ మొగ్గు చూపారు.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటంపై క్రికెటర్ శిఖర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు
బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీకి భారత బోర్డు ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంది. మెల్బోర్న్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశానికి కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ మరియు జే షా ఇద్దరూ హాజరు కానుండగా, షా బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. కాగా పలు టీంలు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పోరులో ఐర్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్లింది. సెమీస్ రేసులో చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ టీం నిలిచింది.
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో సత్కరించడం మొదలుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.
క్రికెట్ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.
T20 ప్రపంచకప్ లో జింబాబ్వే భారత్ ను ఓడిస్తే తాను జింబాబ్వే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని పాకిస్థానీ నటి సెహర్ షిన్వారీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.