Home / cricket news
‘గిన్నిస్ వరల్డ్ రికార్డు’ కూడా భారత్ ఘోర పరాభవంపై ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘చరిత్రలో అతిసులువైన ఛేదన ఇదేనా?’’ అంటూ సెటైర్లు విసిరింది. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారతజట్టు ఓడిపోయినప్పటి నుండి #BOYCOTTIPL ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఐపీఎల్ వల్లే భారత కీలక ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారని, వాళ్ల ఏకాగ్రత దెబ్బతింటోందని, వాళ్లు దేశం కోసం కాకుండా డబ్బు కోసం ఆడుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పరుగులు మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు కథ కంచికి చేరింది. 130 కోట్ల భారతీయుల 15 ఏళ్ల ఎదురు చూపులు కలగానే మిగిలిపోయాయి. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్ తో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా ఇచ్చిన 169 పరుగులు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టు ముందు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండవ సెమీస్‌లో భాగంగా నేడు భారత్ ఇంగ్లండ్ తో తలపడుతుంది. కాగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ తుది దశకు చేరుకుంది. దాదాపు నెలరోజులుగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరు అనేది మరో రెండు మ్యాచ్‌ల్లో తేలనుంది. ఈ నేపథ్యంలోనే నేడు ఇంగ్లండ్‌తో అమీతుమీకి భారత్ సిద్ధమైంది
భారత్ చిరకాల ప్రత్యర్థి అయిన దాయాదీ జట్టు పాకిస్థాన్ పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ సిడ్నీ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ తొలి సెమీస్ మ్యాచ్ లో భాగంగా కివీస్‌పై పాక్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు తేడాతో చేధించింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆకట్టుకున్నప్పటికీ ఐసీసీ పురుషులT20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుండి నిష్క్రమించాడు.
టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. సెమీ ఫైనల్ సమరానికి జట్లు సిద్ధమయ్యాయి. నేడు సిడ్నీ వేదికగా జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖీ తేల్చుకోనున్నాయి.