Last Updated:

Virat Kohli: విరాటుకి వీర లెవెల్లో విషెష్.. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కటౌట్స్

దేశం వ్యాప్తంగా టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి ఎలుగెత్తి చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Virat Kohli: విరాటుకి వీర లెవెల్లో విషెష్.. తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కటౌట్స్

Virat Kohli: విరాట్ కోహ్లీ ఈ పేరు తెలియని వారుండరు. భారత క్రికెట్ లోకంలోనే కాకుండా ఈయనుకు ఖండాంతరాలు దాటి మరీ అభిమాన తారాగణం ఉన్నారు. కింగ్ కోహ్లిగా పేరొందిన విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. మైదానం ఏదైనా సరే పరుగుల వర్షం కురిపించడంలో రన్ మెషీన్ తర్వాతే ఎవరైనా అనే ప్రత్యేక బిరుదు కూడా ఈయనకు ఉంది. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. ఒకప్పటి భారత మాజీ కెప్టెన్ గా వెలుగొందినా.. ప్రస్తుతం ఒక టాప్ ప్లేయర్ గా కొనసాగుతూ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతున్నాడు విరాట్.

దేశం వ్యాప్తంగా టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి ఎలుగెత్తి చాటేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 50 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమాలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఏకంగా 40 ఫీట్ల కోహ్లీ పోస్టర్ ను ఓ బిల్డింగ్ పై అంటించారు. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు కోహ్లీ పేరు ట్రెండ్ అవుతోంది. అటు ముంబైలోనూ విరాట్‌కి వీర లెవల్‌లో విషేష్‌ చెప్తున్నారు ఫ్యాన్స్. గోడలపై భారీ ఎత్తున పెయింట్‌ వేసి.. కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారాయి.

ఇదీ చదవండి: “ప్లేయర్ ఆఫ్ ది మంత్”గా విరాట్ కొహ్లీ.. ఐసీసీ అవార్డ్