Home / cricket news
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టునుంచి బయటకు వచ్చి గోవా జట్టలో చేరాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్ గత ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున రెండు T20లు ఆడాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
భారత క్రికెట్‌కు, సునీల్ గవాస్కర్‌కు గర్వకారణమైన విషయం. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ క్రికెట్ అథారిటీ తమ మైదానానికి గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది.ఇది 5 ఎకరాల మైదానం. ఇప్పటికే గవాస్కర్ చిత్రాన్ని స్టేడియం వెలుపల ఉన్న గోడలలో ఒకదానిపై చిత్రీకరించారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ సంస్థ అన్నవిషయం అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్
లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో భారత జట్టుపై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 247 పరుగుల లక్ష్యాన్ని భారత క్రికెట్ జట్టు చేదించలేకపోయింది.247 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు 146 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా ఔట్ అయ్యారు
లార్డ్స్ వేదికగా నేటి సాయంత్రం 5 గంటలకు భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని బావిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన భారత్... ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్